తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- January 04, 2023
న్యూఢిల్లీ: తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.
తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్న వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులతోపాటు ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు.దీంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఇతర జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది.
కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.ప్రాజెక్టుల పురోగతి పై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీచేశారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







