శర్వానంద్ పెళ్లి చేసుకుంటున్నాడోచ్?!
- January 05, 2023
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకడు శర్వానంద్. ఎప్పుడెప్పుడు శర్వా పెళ్లి చేసుకుంటాడా.? అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే ఆ రోజు రానే వచ్చిందనిపిస్తోంది.
శర్వా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడనీ తాజా ఖబర్. ఓ ఎన్నారై అమ్మాయితో శర్వానంద్‌కి పెళ్లి నిశ్చయమైందట. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ బయటికి వచ్చింది.
పూర్తి వివరాలు ఇంకా తెలీదు కానీ, త్వరలోనే నిశ్చితార్ధం ముహూర్తం ఫిక్స్ చేసుకుని, అధికారికంగా ఈ గుడ్ న్యూస్ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాడట శర్వానంద్.
అన్నట్లు ఈ మధ్య బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన శర్వా.. పెళ్లెప్పుడని బాలయ్య అడగ్గా, ప్రబాస్ తర్వాత చేసుకుంటానని ఫన్నీగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









