విశాఖ వేదికగా జీ20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశం..
- January 07, 2023
అమరావతి: విశాఖ వేదికగా మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు. ప్రతిష్ఠాత్మక రీతిలో భారత్ ఈ ఏడాది జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భారత్ లో జీ20 శిఖరాగ్ర సమావేశంతోపాటు దాదాపు 200 వరకు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి 28, 29 తేదీల్లో జీ20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశం వైజాగ్ లో జరపనున్నారు. ఈ విషయాన్నీ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు.
ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మరో ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజితభార్గవ్‌తో కలిసి మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జీ-20 దేశాలైన అర్టెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, ఇంగ్లండ్, అమెరికా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని 19 సభ్య దేశాలు, 300 మంది వరకు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







