ఒమన్‌లో ఈ-సిగరెట్ల విక్రయాలపై సీపీఏ కొరడా

- January 07, 2023 , by Maagulf
ఒమన్‌లో ఈ-సిగరెట్ల విక్రయాలపై సీపీఏ కొరడా

మస్కట్: ఎలక్ట్రానిక్ సిగరెట్లను విక్రయిస్తున్న పలు దుకాణాలను వినియోగదారుల రక్షణ అథారిటీ (సీపీఏ) సీజ్ చేసింది. సుల్తానేట్‌లో ఇ-సిగరెట్‌లను అమ్మడంపై నిషేధం ఉన్నదని సీపీఏ తెలిపింది. సీపీఏ నియంత్రణ బృందం విలాయత్ ఆఫ్ షినాస్‌లోని దుకాణాలు, మార్కెట్‌లను తనిఖీ చేసిందని పేర్కొంది. ఈ సమయంలో పొగాకు, దాని ఉత్పన్నాలను విక్రయించే దుకాణాలలో అనేక ఎలక్ట్రానిక్ సిగరెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దుకాణదారులు ఎలక్ట్రానిక్ సిగరెట్లు, హుక్కాల వినియోగంపై నిషేధానికి సంబంధించి రిజల్యూషన్ నెం. 698/2015ను ఉల్లంఘించినట్లు అథారిటీ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com