అన్ని వూరుల్లో వైఫై సేవలు: ఏపీ సిఎం
- April 28, 2016
విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లతో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఫైబర్ గ్రిడ్ పూర్తిచేసి ఊరంతా వైఫై తీసుకొస్తామని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు. ఉద్యోగ రథం, జాబ్స్ డైలాగ్‌ను గురువారం సీఎం ప్రారంభించారు. వీటితో పాటుగా దేశంలోనే మొదటి మొబైల్ బేస్డ్ నియామకసంస్థను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉచిత సేవలు అందించనున్న ఉద్యోగ రథం, జాబ్స్ డైలాగ్ వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రతి జిల్లాకో ఉద్యోగ రథాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విభజన సమస్యలున్నా రాష్ట్రంలో వనరులకు కొరత లేదని, ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో ఏపీ మూడోస్థానంలో ఉందని ఆయన తెలిపారు. శ్రీసిటీతో వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







