ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో 301 సినిమాలు..
- January 10, 2023
ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో అయినా స్థానం సాధించాలని చాలా సినిమాలు కలగంటాయి. ప్రతి సంవత్సరం ఆస్కార్ ఈ ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేస్తుంది. అందులో నుంచి ఓటింగ్ తర్వాత కొన్ని సినిమాలని మాత్రమే ఆస్కార్ నామినేషన్స్ కి తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో మొత్తం 301 సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ ని అకాడమీ రిలీజ్ చేసింది.
ఇక ఈ లిస్ట్ లోకి ఇప్పటికే అందరూ అనుకున్నట్టు RRR, అధికారికంగా పంపిన లాస్ట్ ఫిలిం షో సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు గంగూభాయ్ కతీయవాడి, ఆల్ దట్ బ్రీథ్స్, ది కశ్మీర్ ఫైల్స్, రాకెట్రీ, విక్రాంత్ రోనా.. సినిమాలు ఉన్నాయి. ఈ 301 సినిమాలకి జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనున్నాయి.
ఈ 2023 ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండాలంటే ఏ సినిమా అయినా 1 జనవరి 2022 మరియు 31 డిసెంబర్ 2022 మధ్య థియేట్రికల్ రిలీజ్ ఉండాలి. అంతేకాకుండా సినిమా లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, బే ఏరియా, చికాగో, మయామి మరియు అట్లాంటా.. లాంటి అమెరికా ప్రాంతాల్లో రిలీజయి కనీసం వారం రోజుల పాటు ఒకే థియేటర్ లో ఆడాలి. అలాగే కనీసం 40 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉండాలి. మరి ఇండియా నుంచి ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న ఈ సినిమాల్లో ఆస్కార్ నామినేషన్స్ కి ఏది వెళ్తుందో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







