ఆస్కార్ ఘనత సాధించిన 'కాంతార'
- January 10, 2023
బెంగుళూరు: కన్నడ చిత్రం కాంతార మరో అరుదైన ఘనత సాధించింది. రెండు విభాగాల్లో ఆస్కార్ కు కాంతార నామినేట్ అయ్యింది. బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను కాంతార సినిమా 95ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ..ముందుగా కన్నడ లో విడుదలై భారీ విజయం సాధించింది. ఆ తర్వాత మిగిలిన పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను ఎటు కదలకుండా చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి ఇండియన్ సినిమాగా నిలిచింది.ఈ మూవీ రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను కాంతార సినిమా 95ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







