భారీ బడ్జెట్ తో చరణ్ సినిమా..!

- April 28, 2016 , by Maagulf
భారీ బడ్జెట్ తో చరణ్ సినిమా..!

ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్న స్టార్ హీరోల్లో రాం చరణ్ ఒకడు. మిగతా హీరోలంతా 50 కోట్లు, 100 కోట్లు అంటూ కలక్షన్స్ టార్గెట్స్ పెట్టుకుంటుంటే చెర్రి సినిమాలు హిట్ అయితే చాలు అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన బ్రూస్ లీలో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం తని ఒరువన్ రీమేక్ ధృవ సినిమాలో నటిస్తున్న చరణ్ తర్వాత సుకుమార్ తో సినిమా కన్ ఫర్మ్ చేశాడు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. సుకుమార్ కూడా నాన్నకు ప్రేమతో హిట్ తో మంచి ఖుషీగా ఉన్నాడు. చెర్రి కోసం ఒ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ కథతో రాబోతున్నాడు సుక్కు. అంతేకాదు సినిమా బడ్జెట్ కూడా 70 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మరి అంత బడ్జెట్ చెర్రి మీద ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించాలి.అసలే మార్కెట్ డల్ గా ఉన్న ఈ సమయంలో అంత భారీ బడ్జెట్ సినిమా అవసరమా అనేస్తున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ఇక సుకుమార్ 14 రీల్స్ వారితో మహేష్ తో తీసిన 1 నేనొక్కడినే కూడా భారీ బడ్జెట్ తో రూపొందించబడింది. ఆ సినిమా ఫలితం గురించి అందరికి తెలిసిందే. ఆ దెబ్బతో 14 రీల్స్ బ్యానర్ పరిస్థితి మారిపోయింది.మరి చరణ్ తో సుక్కు తీస్తున్న సినిమా బడ్జెట్ తగ్గించుకుని సినిమా తీయడం బెటర్ లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో వెళ్లడించే ఈ సినిమాపై ఓ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పట్లోగా బడ్జెట్, మిగతా స్టార్ కాస్ట్ గురించి కూడా పూర్తి డీటేల్స్ తెలిసే ఛాన్స్ ఉంది.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com