అల్ సఫా మెట్రో స్టేషన్‌కు కొత్త పేరు: ఆర్టీఏ
- January 11, 2023
దుబాయ్: అల్ సఫా మెట్రో స్టేషన్‌కు కొత్త పేరును పెట్టినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. మెట్రో స్టేషన్ కు పేరు పెట్టే హక్కులను టెక్ కంపెనీకి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. దుబాయ్ మెట్రో రెడ్ లైన్‌లో ఉన్న అల్ సఫా మెట్రో స్టేషన్‌ను ఇకపై ONPASSIVE మెట్రో స్టేషన్‌గా రీబ్రాండ్ చేయనున్నట్లు తెలిపింది. ONPASSIVE అనేది గ్లోబల్ AI టెక్నాలజీ కంపెనీ. రీబ్రాండింగ్ 10 సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని పేర్కొంది. నామకరణ హక్కుల పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా నవంబర్ 2020లో నూర్ బ్యాంక్ మెట్రో స్టేషన్ పేరును అల్ సఫా మెట్రో స్టేషన్ గా మార్చారు. అలాగే అల్ ఫాహిదీ పేరును షరాఫ్ DG మెట్రో స్టేషన్, ఫస్ట్ అబుధాబి బ్యాంక్ ను ఉమ్ అల్ షీఫ్, నూర్ బ్యాంక్ ను అల్ సఫా, డమాక్ ను దుబాయ్ మెరీనా, నఖీల్ పేరును అల్ ఖైల్ గా మార్చారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







