‘పఠాన్’ కోసం కింగ్ ఖాన్ పబ్లిసిటీ పాట్లు.!
- January 11, 2023
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్య రిలీజైన దీపికా పదుకొనె సాంగ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.
అసలే బాలీవుడ్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. దాంతో, ‘పఠాన్’పై గట్టి ఆశలే పెట్టుకుంది బాలీవుడ్ బాక్సాఫీస్. అలాగే షారూఖ్ ఖాన్ కూడా.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజయ్యింది. కనీ వినీ ఎరుగని హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లతో ట్రైలర్ మొత్తం నింపేశారు. సినిమా మంచి విజయం సాధించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కింగ్ ఖాన్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు సోషల్ మీడియా వేదికగా.
ఈ నేపథ్యంలో కింగ్ ఖాన్, చరణ్‌కి రిప్లై ఇచ్చారు. జస్ట్ థాంక్స్ మెసేజ్ కాదండోయ్. ‘మీ ఆర్ఆర్ఆర్ దక్కించుకున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఇండియాకి తీసుకొచ్చినప్పుడు దాన్ని తాకే చిన్న అవకాశం మాక్కూడా ఇవ్వండి ప్లీజ్..’ అని కింగ్ ఖాన్ పెట్టిన మెసేజ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. చరణ్‌తో షారూఖ్‌కి వున్న స్నేహం నేపథ్యంలో ఇంత చనువుగా పోస్ట్ పెట్టేశాడు. ఈ పోస్ట్ ఇటు చరణ్ అభిమానుల్నీ, అటు కింగ్ ఖాన్ అభిమానుల్నీ సైతం ఖుషీ చేస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







