నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ.. అంటోన్న మెగాస్టార్.!

- January 11, 2023 , by Maagulf
నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ.. అంటోన్న మెగాస్టార్.!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ నుంచి తాజాగా మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ..’ అనే రొమాంటిక్ సాంగ్ ఇది.
ఈ సాంగ్‌లో చిరంజీవి కాస్ట్యూమ్స్, సిగ్నేచర్ స్టెప్ప్.. ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయ్. రొమాంటిక్ కటింగ్స్‌లో చిరంజీవి తర్వాతే ఎవరైనా. ఆ కట్స్‌తో మాస్‌నీ క్లాస్‌నీ కూడా అల్లల్లాడించేస్తున్నారు ఈ సాంగ్‌లో మెగాస్టార్.
శృతిహాసన్ క్యూట్ అండ్ హాట్ లుక్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయ్. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరి 13న ‘వాల్తేర్ వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. 
మాస్ రాజా రవితేజ కీలక పాత్ర పోషించగా, కేథరీన్ మరో హీరోయిన్‌గా నటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com