భారత్ జోడో యాత్ర ముగింపు సభకు 24 పార్టీలకు ఆహ్వానం
- January 11, 2023
న్యూ ఢిల్లీ: భారత్ జోడో యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 30న ముగియనుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మీదుగా ప్రస్తుతం పంజాబ్ చేరుకుని, అక్కడే కొనసాగుతోంది. కొద్ది రోజుల్లో పంజాబ్ దాటి హిమాచల్ ప్రదేశ్ చేరుకుంటుంది. అక్కడ ముగించుకుని జమ్మూ కశ్మీర్ చేరుకుంటుంది. ఈ రాష్ట్రంలో పర్యటన అనంతరం ముగుస్తుంది.
యాత్ర ప్రారంభానికి ముందు బహుశా కాంగ్రెస్ పార్టీలో సైతం కొన్ని ఆందోళనలు ఉన్నాయట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం.. కాంగ్రెస్ పరిస్థితి రాను రాను మరింత దారుణంగా పరిస్థితికి చేరింది. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్ర పట్ల కాంగ్రెస్ వర్గాల్లోనే అనుమానాలు ఉండేవట. అయితే యాత్ర ప్రారంభై కొనసాగుతున్న క్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో, పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్న ఆనందంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. దీంతో ఈ యాత్ర ముగింపు సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందు కోసం దేశంలో భావసారూప్యత కలిగిన 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. మాయావతి (బహుజన్ సమాజ్ పార్టీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ), నితీశ్ కుమార్ (జనతాదళ్ యూనియన్), చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం పార్టీ), లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ్ జనతా దళ్), అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), కమ్యూనిస్ట్ పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. ఇందులో ఎంత మంది హాజరవుతారనేది జనవరి 30న జరిగే ముగింపు కార్యక్రమం రోజున తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







