విశిష్టగౌరవం

- January 11, 2023 , by Maagulf
విశిష్టగౌరవం

విశ్వవేదికపై విరిసిన చిరునవ్వులు
తెలగుభాషకి  దక్కిన విశిష్టగౌరవం
తెలుగుపదాల కమ్మనైన సోయగం
పల్లెపాటకిలభించే ఘనమైన సత్కారం.... 

చంద్రబోస్ స్వీయవిరచిత మాధుర్యం 
అక్షరాలకి సొబగులద్దిన వారివైనం
కవికలం నుంచిజాలువారిన ఆణిముత్యం
పాటపాటలో పొదిగిన అక్షరవైఢూర్యం..

ఆర్ఆర్ఆర్ చిత్రానికి బాణీలసంగీతం 
కీరవాణి సరిగమలకి దాసోహం 
ఉట్టిపడే  రాజమౌళి సాహసరాజసం 
అందుకొన్నారు గ్లోబల్ బహుమానం .....

తెలుగుపాటకి దక్కిన సగర్వవిజయం 
తెలుగునేలపై ఎగిరిన విజయకేతనం 
నాటునాటు పాట జానపద నిదర్శనం 
తెలుగుభాషకే పట్టం కట్టిన చిత్రరాజం .....

పదంపదంలో తొణికిసలాడే వయ్యారాలు
హవభావాలతో అధ్భుత నృత్యగీతికలు 
సినీచరితలో నిండైన నీరాజనాలు 
అపురూపమైన ఙ్ఞాపిక సుమధుర కానుక....

--యామిని కోళ్ళూరు(అబుధాభి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com