అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..
- January 11, 2023
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీని ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ యూజర్ల కోసం జనవరి 16న సేల్ ప్రారంభమవుతుంది.అయితే మిగతా వారందరికీ జనవరి 17న డిస్కౌంట్ ఆఫర్‌లు లభిస్తాయి. ఈ సేల్ జనవరి 20 వరకు కొనసాగుతుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది.
రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అమెజాన్ యాపిల్, వన్ ప్లస్, రెడ్మీ, పోకో, శ్యాంసంగ్ సహా అనేక ఇతర ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు, SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. SBI కార్డ్ ద్వారా చేసే EMI లావాదేవీలపై కూడా ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ కచ్చితమైన డీల్స్ వెల్లడించనప్పటికీ.. ఐఫోన్ 13, ఐఫోన్ 14తో సహా ఆపిల్ ఐఫోన్‌లు సేల్ సమయంలో డిస్కౌంట్‌తో వచ్చిందని సూచించింది. అమెజాన్ వన్ ప్లస్, రెడ్మీ, శ్యాంసంగ్, క్సియోమి, అనేక ఇతర బ్రాండ్‌ల నుంచి ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. నిర్దిష్ట డిస్కౌంట్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ప్లాట్‌ఫారమ్ వెల్లడించింది. కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో వన్ ప్లస్ 10T,శ్యాంసంగ్ గాలక్సీ S20 FE, ఐకు నియో 6, రెడ్మీ నోట్ 11 మరికొన్ని భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, అనేక ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై కూడా అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తుంది.
ఈ-కామర్స్ దిగ్గజం ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు తగ్గింపు లేదా ఫిట్‌నెస్ బ్యాండ్ కేటగిరీని అందించనున్నట్లు వెల్లడించింది. అదనంగా, హెడ్‌ఫోన్‌లు, నెక్‌బ్యాండ్‌లపై కూడా 75 శాతం తగ్గింపు ఉంటుందని అంచనా. అలాగే స్పీకర్ల ధర 65 శాతం తగ్గుతుంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్‌లతో సహా పెద్ద అప్లియన్సెస్‌పై కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







