ఈ నెల 18న హైదరాబాద్ లో వన్డే మ్యాచ్..
- January 11, 2023
హైదరాబాద్: ఇటీవలే టీ20 మ్యాచ్‌కు వేదికైన హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో త్వరలో మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుంది.ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో ఇండియా సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ తొలి వన్డే ఈ నెల 18న జరుగుతుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరగబోతుండటం విశేషం. ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్ వెల్లడించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతుందని అజార్ తెలిపారు.
అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్‌లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం ఈ నెల 14న న్యూజిలాండ్ టీమ్ హైదరాబాద్ వస్తుంది. 15న ప్రాక్టీస్ చేస్తారు. 15న శ్రీలంకతో టీమిండియాకు మ్యాచ్ ఉన్న దృష్ట్యా, 16న భారత జట్టు హైదరాబాద్ చేరుకుంటుంది. 17న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!