అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్..ప్రసాదం విక్రయాలు బంద్..
- January 12, 2023
త్రివేండ్రం: అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు దిక్కుల నుంచి కోట్లాది మంది భక్తులు శబరిమల వస్తుంటారు. స్వామివారి దర్శనం అనంతరం పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని తీసుకుని తిరుగుపయనం అవుతారు. కానీ, ఇప్పుడు అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ప్రసాద విక్రయాలను బంద్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఈ ప్రసాదం తయారీకి వాడిన యాలకుల్లో క్రిమి సంహారకాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ నివేదికలో వెల్లడైంది. ఈ విషయం కాస్తా హైకోర్టు వరకు వెళ్లింది.
నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. ప్రసాదం విక్రయాలు ఆపాలని ఆదేశించింది. దాంతో ట్రావెన్కోర్ ట్రస్ట్.. ప్రసాదం విక్రయాలను నిలిపివేసింది. అయితే, యాలకులు లేకుండా ప్రసాదాల తయారీకి అనుమంచింది హైకోర్టు. కాగా, కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం నుంచి విక్రయాలు ఆగిపోయాయి. కోర్టు ఆదేశాలతో దాదాపు 6.5 లక్షల ప్రసాదం డబ్బాల పంపిణీ నిలిచిపోయింది.
కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రసాదాల తయారీకి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మరోవైపు ప్రసాదం విక్రయాలు నిలిచిపోవడంతో భక్తులు ఉసూరుమంటున్నారు. అయ్యప్ప ప్రసాదం దొరక్కపోవడంతో కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







