బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సర్వీస్
- January 12, 2023
బెంగళూరు: బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం, హోసూరు ఏరోడ్రోమ్ ను కలుపుతూ ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఫ్లై బ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ సంస్థలు జాయింట్ వెంచర్ గా ఈ సేవలను ప్రారంభించాయి.హెలికాప్టర్ సర్వీసుల కోసం ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు.
హోసూరు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గంలో చేరుకునేందుకు 3 గంటల సమయం పడుతుంది. హెలికాప్టర్ ద్వారా 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. బుధవారం నుంచి బ్లేడ్ ఇండియా వెబ్ సైట్ లో హెలికాప్టర్ సర్వీసుల బుకింగ్స్ ప్రారంభించారు. 2019లో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించిన బ్లేడ్ ఇండియా.. మహారాష్ట్రలోని ముంబై, పూణె, షిర్డీల మధ్య సేవలు అందిస్తోంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..