ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ
- January 12, 2023
అమరావతి: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైదొలగిన సోమేశ్ కుమార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిశారు. సోమేశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎస్ జవహర్ కూడా ఉన్నారు. సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కారుకి సోమేశ్ కుమార్ ఈ విషయంపై రిపోర్టు చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.
అనంతరం ఆయన వీఆర్‌ఎస్ తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఇవాళ జవహర్ రెడ్డిని కలిసిన సోమేశ్ కుమార్ అనంతరం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే ఏపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం జాయినింగ్ రిపోర్టు అందించిన తర్వాత సోమేశ్ కుమార్ వీఆర్‌ఎస్ తీసుకోవడానికి అవకాశం ఉంది.
సర్వీసుకి ఏపీకి వెళ్లేందుకు సోమేశ్ కుమార్ కు ఆసక్తి లేదని తెలుస్తోంది. కాగా, తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారిని నియమిస్తూ నిన్న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీనియార్టీ, సర్వీసు ఆధారంగా ఆమె నియామకం జరిగింది. తెలంగాణ కేడర్ లో సోమేశ్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సి ఉంది. అందుకు నేడు చివరి రోజు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







