‘వాల్తేర్ వీరయ్య’: మూవీ రివ్యూ.!
- January 13, 2023ఓ అభిమాని చిరంజీవితో సినిమా తీస్తే ఎలా వుంటుందో, అదే ‘వాల్తేర్ వీరయ్య’. చాలా కాలం తర్వాత చిరంజీవిని వింటేజ్ లుక్స్‌లో చూడబోతున్నాం ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో నటించిన కంప్లీట్ మాస్ కమర్షియల్ జోనర్ సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. ఇన్ని అంచనాలతో తెరకెక్కిన ‘వాల్తేర్ వీరయ్య’ కథా కమామిషు ఏంటి.? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
వాల్తేర్కి చెందిన వీరయ్య(మెగాస్టార్ చిరంజీవి) ఓ ఫిషర్ మేన్. కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోయే వీరయ్యను సడెన్‌గా ఓ డ్రగ్స్ కేస్‌కు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే, మరో ఫిషర్ మేన్ చేసిన తప్పు కారణంగా తాను అరెస్ట్ అయ్యానని తెలుసుకున్న వీరయ్య ఏం చేశాడు.? అసలు డ్రగ్స్ మాఫియాకీ, వీరయ్యకీ ఏం సంబంధం.? కథలో ఆ రెండో ఫిషర్ మేన్ ఎవరు.? ఆ ఫిషర్ మేన్ కేసును వీరయ్యకు ఎందుకు కనెక్ట్ చేశారు.? చివరికి ఆ డ్రగ్స్ కేస్ సంగతి వీరయ్య ఎలా తేల్చాడు.? అనేది మిగతా కథ. ఆ కథ తెలియాలంటే ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
ముందే చెప్పుకున్నాం.. ఓ అభిమాని చిరంజీవిని డైరెక్ట్ చేస్తే ఎలా వుంటుంది.? బొమ్మ దద్దరిల్లిపోద్ది. అలాగే ‘వాల్తేర్ వీరయ్య’ ఓపెనింగ్స్‌తోనే ఫ్యాన్స్‌లో పూనకాలు లోడ్ అయిపోయాయ్. వింటేజ్ లుక్స్‌లో చిరంజీవిని చూసిన ఫ్యాన్స్ ఖుషీ మామూలుగా లేదు. 150 సినిమాల తన అనుభవాన్ని పూర్తిగా రంగరించేశాడు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి. అంత అనుభవం వున్న ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. ఆయనని అలా చూస్తూనే మైమర్చిపోయారు అభిమానులు. ఆ ఎనర్జీ, ఆ టైమింగ్, స్టైలింగ్, తనదైన మాస్ కటింగ్స్, ఆ సెన్సాఫ్ హ్యూమర్.. వాట్ నాట్ మాటల్లేవ్ మాట్టాడుకోవడాల్లేవ్ అంతే.! మెగా ఫ్యాన్స్‌కి మెగాస్టార్ లుక్స్ ఐ ఫీస్ట్.
హీరోయిన్గా శృతిహాసన్ పాత్ర కేవలం ఫస్టాఫ్‌కే పరిమితమైంది.పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు ఆమె పాత్రకు. వున్నంతలో గ్లామర్‌గా కనిపించి మెప్పించింది. మరో కీలక పాత్రధారి అయిన రవితేజ, సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తాడు.చిరంజీవితో మాస్ రాజా సన్నివేశాలు ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తాయ్.చాలా కాలం తర్వాత చిరంజీవి స్ర్కీన్ షేర్ చేసుకున్న రవితేజ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
కమెడియన్లలో వెన్నెల కిషోర్ పాత్ర ఆకట్టుకుంటుంది.మిగిలిన వాళ్లు జస్ట్ ఓకే. ప్రకాష్ రాజ్ తనకు అలవాటైన పాత్రలోనే మళ్లీ కనిపించి మెప్పించారు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
దర్శకుడిగా బాబి తన పూర్తి ఎఫర్ట్ పెట్టేశాడు. మాస్ కథాంశాన్ని, బాస్‌తో ఎలివేట్ చేసిన విధానం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి. బాస్ పార్టీ సాంగ్‌లో ఆ పనితనం బాగా కనిపించింది.దేవిశ్రీ ప్రసాద్ తన ఆర్ఆర్తో నో డౌట్ ధియేటర్లో పూనకాలు తెప్పించేశాడు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండుదనిపిస్తుంది సెకండాఫ్‌లో. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా వుంది.నిర్మాణంలో మైత్రీ మూవీస్ ఏమాత్రం రాజీ పడలేదు.
చివరిగా:
‘వాల్తేర్ వీరయ్య’ అసలు సిసలు సంక్రాంతి సినిమా.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము