సౌదీ పౌరసత్వం మంజూరులో సవరణ..

- January 13, 2023 , by Maagulf
సౌదీ పౌరసత్వం మంజూరులో సవరణ..

రియాద్: సౌదీ అరేబియా పౌరసత్వం మంజూరులో కొత్త సవరణను ప్రవేశ పెట్టింది.దీనిలో భాగంగా సౌదీ జాతీయత వ్యవస్థలో కీలక మార్పులు చేసింది.ఈ మేరకు జాతీయత వ్యవస్థలోని ఆర్టికల్ 8లో చేసిన సవరణను కింగ్‌డమ్‌లోని ఉన్నతాధికారులు తాజాగా ఆమోదించారు.తాజా సవరణ ప్రకారం ఇకపై పౌరసత్వం  ఇచ్చే అధికారాన్ని ప్రధాన మంత్రికి ఇవ్వడం జరిగింది.ఇంతకు ముందు ఈ అధికారం దేశ అంతర్గత మంత్రికి ఉండేది. ఆర్టికల్ 8ని సవరించి ఇప్పుడు ప్రధానికి ఇచ్చారు.

ఇక సౌదీ అరేబియా జాతీయత వ్యవస్థలోని ఆర్టికల్ 8 అనేది షరతులకు లోబడి విదేశీ తండ్రి, సౌదీ తల్లికి కింగ్‌డమ్‌లో జన్మించిన వ్యక్తులకు సౌదీ పౌరసత్వం మంజూరు చేయవచ్చని చెబుతుంది. ఇలా పౌరసత్వం పొందిన వారు అక్కడి పౌర చట్టంలో పేర్కొన్న విధంగా నిర్ణీత వయసు వచ్చిన తర్వాత శాశ్వత నివాస హోదాను పొందడం జరుగుతుంది. తద్వారా ఆ దేశంలో సాధారణ పౌరులు పొందే అన్ని సేవలు వీరికి కూడా దక్కుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com