ఫోన్ కుంభకోణంలో 21 మంది అనుమానితులను షార్జాలో అరెస్టు

- April 28, 2016 , by Maagulf
ఫోన్ కుంభకోణంలో  21 మంది  అనుమానితులను షార్జాలో అరెస్టు

 
షార్జ:   మీ టెలిఫోన్ నెంబర్ విలువైన బహుమతులను గెలుపొందిందని బురిడీ కొట్టించే మోసగాళ్ళకు షార్జా పోలీసులు చెక్ పెట్టారు. డబ్బు బదిలీ కావాలంటే మీ బ్యాంకు ఖాతా వివరాలు తెలియచేయాలని అందుకు ప్రతిఫలంగా మొబైల్ ఫోన్లకు రీచార్జ్ డబ్బుని పంపుతామనే 21 మంది సభ్యులుగల ఒక కుంభకొణ  బృందాన్ని గురువారం అరెస్టు చేశారు. పాకిస్తాన్ జాతీయత అనుమానితులు , ఒక ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (ఎటిసలాట్) నుండి ఫోన్ కాల్ చేస్తూ మీ టెలిఫోన్ నెంబర్ కు   200,000 దినార్ల తో పాటు ఐఫోన్ 6 ఫోన్ బహుమతి లభించిందని వాటిని మీరు సాధించడం కోసం వెంటనే డబ్బు బదిలీ చేయాలని వారు తీవ్ర ఒత్తిడి తిసుకోస్తున్నారని  నమ్మకమైన బాధితులు చెప్పారు. ఆ బహుమతి అందుకునే ముందు కొన్ని విధానాలు పూర్తి చేయాలని అందుకు మీరు  5,000 దినార్ల  మరియు10,000 దినార్ల మధ్య మొత్తాన్ని తమకు బదిలీ చేయాలని తర్వాత  ఆ మొత్తాలను బహుమతిగా అందుకోగలరని వారు పేర్కొంటున్నారని బాధితులు ఆరోపించారు.  షార్జా నేర పరిశోధక విభాగం పోలీసులు అక్రమ కార్యకలాపాలు గురించి ఒక చిట్కాని ఉపయోగించేముందు  ఒక జట్టుని  ఏర్పాటు చేశారు.మోసకరమైన బహుమతుల ప్రకటన ద్వారా అమాయక ప్రజలు ఎవరైనా తమ  ఎరకు చిక్కితే, వారి వద్ద నుంచి డబ్బు పుచ్చుకున్న తరువాత అనుమానితులను పోలిసుల నిఘాకి  దొరకకుండా వారి సిమ్ కార్డ్ మార్చేసి ఈ బృందం అదృశ్యం అవుతారు. ఆ  ముఠా సభ్యుల జాడ తెల్సుకోనేందుకు పోలీసులు ఒక బాధితుడు ద్వారా ఫోన్ చేయించి ఆ బృందాన్ని     అల్ ణహ్ద లోని  రెండు అపార్టుమెంట్లపై పోలీసులు దాడి చేశారు. అక్కడ  మొబైల్ ఫోన్లను  మరియు పెద్ద సంఖ్యలో  సిమ్ కార్డులను స్వాధీనం చేసుకొన్నారు. అనుమానితులు తమ  నేరాలను  ఒప్పుకున్నారు మరియు ప్రజా విచారణకు వారిని పంపించారు .క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖ డిప్యూటీ చీఫ్ లేఫ్టినెంట్ కల్నల్ ఫైసల్ బిన్ నాసర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ,  ఏదైనా అనుమానాస్పద చర్యలు లేదా నేరాలకు పాల్పడే వారి గురించి సమాచారాన్ని తెలియచేసి భద్రతా సంస్థలకు  సహకరించాలని కోరారు. మరియు 999 లేదా 06-5632222 లేదా టోల్ ఫ్రీ నెంబర్ నజీద్  800 151 లేదా ఎస్ .ఎం. ఎస్ ద్వారా  తెలియచేయాలని కోరారు అలాగే  7999 లేదా www.shjpolice.gov.ae/najeed  కు  ఈ మెయిల్ చేయాలని కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com