కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- May 19, 2024
యూఏఈ: కోల్డ్ కాలింగ్ కోసం యూఏఈ రూల్స్, ఫైన్ సెట్ చేసింది. కోల్డ్ కాలింగ్‌పై నిబంధనలను కఠినతరం చేయడానికి ప్రభుత్వం జరిమానాలను ప్రవేశపెట్టింది. విక్రయదారుల నుండి వరుసగా కాల్లు వస్తూ ఇబ్బంది పెడుతుంటారని దుబాయ్ నివాసి అలైన్ గాల్వెజ్ తెలిపారు. "ఫారెక్స్ ట్రేడింగ్" పేరిట నాలుగు నెలల పాటు కాల్ వస్తూనే ఉన్నాయని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో జరిగిన సమావేశంలో కోల్డ్ కాలింగ్‌ను నియంత్రించే నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది. టెలిమార్కెటింగ్ పద్ధతుల కోసం మార్గదర్శకాలు సెట్ చేయనున్నారు. ఉల్లంఘనలకు జరిమానాలు కూడా ఉంటాయని, నిబంధనలను అమలు చేయడానికి ఫెడరల్ మరియు స్థానిక అధికారులు కలిసి పని చేస్తారని పేర్కొన్నారు. నివాసితులు 'డోంట్ కాల్ రిజిస్ట్రీ (DNCR)'లో కూడా సైన్ అప్ చేయవచ్చని, నమోదు చేసుకోవడం ద్వారా టెలిమార్కెటింగ్ మరియు ప్రమోషనల్ కాల్‌లను నియంత్రించవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!







