తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 15, 2023
న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైంది. వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ అత్యాధునిక రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని వందే భారత్ రైలు తగ్గిస్తుందని చెప్పారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఈ రైలు ద్వారా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాన్ని అనుసంధానిస్తూ ప్రయాణం కొనసాగింవచ్చని చెప్పారు. ఈ ఆధునాతన రైళ్లను పూర్తిగా దేశీయంగా తయారు చేశామని, వీటితో బహుళ ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. అత్యంత వేగంతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయొచ్చని తెలిపారు.
రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. ఇవాళ ప్రత్యేక వేళల్లో ఈ రైలు పరుగులు తీస్తోంది. ఇవాళ ఒక్కరోజు 21 స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. ఈ సందర్భంగా సిికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాలేదు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ఇవాళ వందే భారత్ రైలును ప్రారంభిస్తుండడం సంతోషకరమని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ ను రూ.699 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. కాగా, రేపటి నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు సేవలు అందుతాయి. నిన్న వందే భారత్ రైలు టికెట్ బుకింగులు ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇప్పటికే దేశంలోని పలు మార్గాల్లోనూ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. భారత్ లో దాదాపు 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో నిధులు కేటాయించింది. ఈ రైళ్లను మూడేళ్లలో తయారు చేస్తారు. ఈ రైళ్లు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో వీటిని రూపొందిస్తున్నారు. గత బడ్జెట్ లో రైల్వే శాఖకు రూ.1,40,367.13 కోట్ల నిధులు కేటాయించారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







