రన్‌ వే పై కుప్పకూలిన విమానం..40 మంది మృతి

- January 15, 2023 , by Maagulf
రన్‌ వే పై కుప్పకూలిన విమానం..40 మంది మృతి

నేపాల్‌: నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. విమానానికి మంటలు అంటుకున్నాయి.సహాయక బృందాలు కొందరు ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.విమాన ప్రమాదంలో 40 మంది మృతి చెందారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చే విమానాలను వేరే చోటుకి మళ్లించే అవకాశం ఉంది. కుప్పకూలిన ఆ విమానం యతి విమానాయాన సంస్థకు చెందిన ఏటీఆర్ 72 విమానమని అధికారులు తెలిపారు.

అది కాఠ్మాండూ నుంచి పొఖ్రా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతోంది. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com