మస్కట్ బస్సు ప్రమాదంలో 22 మందికి గాయాలు

- January 17, 2023 , by Maagulf
మస్కట్ బస్సు ప్రమాదంలో 22 మందికి గాయాలు

మస్కట్: సీబ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. ఈ మేరకు CDAA ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్,  అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు 25 మంది ప్రయాణికులతో కూడిన బస్సు విలాయత్ ఆఫ్ సీబ్‌లో ప్రమాదానికి గురైందని పేర్కొంది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయని తెలిపింది. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు అందించామని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికార యంత్రాంగం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com