ఖతారీయేతరుల కోసం రియల్ ఎస్టేట్ వినియోగ ప్రాంతాల జాబితా ఖరారు
- January 17, 2023
దోహా: దేశంలోని నాన్-ఖతారీ నివాసితుల కోసం ఖతార్‌లోని 16 ప్రాంతాలను న్యాయ మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఖతారీయేతర నివాసితులకు ఆసక్తి ఉన్న ప్రాంతాల కింద మ్షెరీబ్ (13), ఫిరీజ్ అబ్దుల్ అజీజ్ (14), అల్ దోహా అల్జదీదా (15), ఓల్డ్ అల్ ఘనీమ్ (16), అల్ రుఫా, ఓల్డ్ అల్ హిట్మీ (17), అల్ సలాటా ( 18), ఫిరీజ్ బిన్ మహమూద్ (22), ఫిరీజ్ బిన్ మహమూద్ (23), రౌదత్ అల్ ఖైల్ (24), అల్ మన్సౌరా, ఫిరీజ్ బిన్ దుర్హమ్ (25), నజ్మా (26), ఉమ్ ఘువాలినా (27), అల్ ఖులైఫత్ (28) , అల్ సద్ (38), అల్ మిర్కాబ్ అల్ జదీద్, ఫిరీజ్ అల్ నాస్ర్ (39), దోహా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతం (48) లను చేర్చింది. ఖతారీయేతరులకు ఉపయోగ చట్టం(usufructuary law) కింద లభించే ప్రత్యేకాధికారాలు రెండు వర్గాలుగా విభజించారు. 3,650,000 ఖతార్ రియాల్‌ల కంటే తక్కువ కాకుండా ఆస్తి కొనుగోలు చేసిన వారిని మొదటి వర్గం కింద పరిగణిస్తారు. వారికి ఆరోగ్య సంరక్షణ, విద్య, పెట్టుబడితో సహా శాశ్వత రెసిడెన్సీ కార్డ్ హోల్డర్‌ల ప్రయోజనాలను కల్పిస్తారు. ఇక 730, 000 రియాల్స్ కంటే తక్కువ ఆస్తి కొనుగోలు చేసే వారిని రెండవ వర్గం కింద పరిగణిస్తారు. వీరికి స్పాన్సర్ అవసరం లేకుండానే రెసిడెన్సీని మంజూరు చేస్తారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







