రామ్ చరణ్ - ఉపాసన ప్రెగ్నెన్సీ: అలా కోరుకుంటోన్న సుస్మిత.!
- January 17, 2023
మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్న సంగతి తెలిసిందే. అదేనండీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు కాబోతున్నగుడ్ న్యూస్ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
వెరీ లేటెస్ట్‌గా ఉపాసన కూడా తనదైన శైలిలో స్పందించింది తన మాతృత్వం గురించి. తాజాగా మెగా డాటర్ సుస్మిత.. రామ్ చరణ్, ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ గురించి తన మనసులోని కోరికను మెగా ఫ్యాన్స్‌తో పంచుకుంది.
‘వాల్తేర్ వీరయ్య’ సినిమాకిగాను కాస్ట్యూమ్స్ డైజనర్‌గా పని చేసిన సుస్మిత, సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ - ఉపాసనల ప్రెగ్నెన్సీ గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ విధంగా స్పందించింది.
తనకు మేనకోడలు పుట్టినా, మేనల్లుడు పుట్టినా ఓకే కానీ, అబ్బాయి పుడితే ఇంకా బాగుంటుందని మెగా ఇంటికి వారసుడు వచ్చినట్లవుతుందని చెప్పింది. ఇప్పటికే (సుస్మిత, శ్రీజ పిల్లలు) ఇంట్లో నలుగురు ఆడపిల్లలున్న కారణంగా సహజంగానే సుస్మిత అలా కోరుకోవడం తప్పేమీ కాదనుకోండి. అయితే, మెగా ఇంటికి రాబోతున్న ఆ వారసులు ఎవరో తెలియాలంటే లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







