షాకింగ్: జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకోవడానికి కారణమదేనా.?

- January 17, 2023 , by Maagulf
షాకింగ్: జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకోవడానికి కారణమదేనా.?

ఎంత బిజీ అయినా కానీ, జబర్దస్త్‌ని వదులుకోనని చెప్పిన బుల్లితెర యాంకర్ అనసూయ ఈ మధ్య జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ మధ్య పెద్దగా షోలలోనూ అనసూయ కనిపించడం లేదు.

అఫ్‌కోర్స్.! సినిమాల్లో చాలా బిజీ అయిపోయిందనుకోండి. ‘పుష్ప 2’, ‘హరి హర వీరమల్లు’, ‘భోళా శంకర్’ తదితర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌లో నటిస్తోంది అనసూయ భరద్వాజ్.
అసలు మ్యాటర్ ఏంటంటే, జబర్దస్త్ నుంచి తాను తప్పుకోవడానికి కారణం బాడీ షేమింగ్, తనపై వేస్తున్న జుగుప్సాకరమైన పంచ్‌ల కారణంగానే తాను ఆ షో నుంచి తప్పుకున్నట్లు గతంలో వ్యాఖ్యానించింది అనసూయ.

అయితే, ఇప్పుడు మాత్రం తన కొడుకుల వల్లే ఆ షో వదిలేశానని చెబుతోంది విచిత్రంగా. తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం కోసమే టీవీ షోలకి గుడ్ బై చెప్పేశానంటూ అనసూయ తాజాగా చెబుతోంది. ఈ మాటలకు సోషల్ మీడియాలో భిన్న రకాల స్పందనలు వినిపిస్తున్నాయ్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com