‘పటాన్’ డైరెక్టర్‌తో ప్రబాస్ తగ్గేదే లే.!

- January 17, 2023 , by Maagulf
‘పటాన్’ డైరెక్టర్‌తో ప్రబాస్ తగ్గేదే లే.!

షారూఖ్ ఖాన్ హీరోగా ‘పటాన్’ అనే సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే. జనవరి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి నెగిటివిటీ కారణంగానో, ఇంకో రకంగానో బజ్ బాగానే వుంది.

ఆ సంగతి అటుంచితే, ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ కన్ను యూనివర్సల్ స్టార్ ప్రబాస్‌ మీద పడిందట. ప్రబాస్‌తో సిద్దార్ధ్ ఆనంద్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ గురించి తెర వెనుక ఏర్పాట్లన్నీ జరిగిపోయాయట. 

మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రబాస్ మూడు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటూ, మారుతి డైరెక్షన్‌లో హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

‘ఆదిపురుష్’ ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ‘సలార్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘ప్రాజెక్ట్ కె’ కూడా సెట్స్ మీదే వుంది. ఈ లోపే మరో ప్రెస్జీజియస్ ప్రాజెక్ట్‌కి ప్రబాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం పట్ల ఫ్యాన్స్ పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com