GMR ఎయిరోసిటీ హైదరాబాద్ కు రానున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్
- January 17, 2023
హైదరాబాద్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) మార్చి 2023 నుండి GMR ఏరోసిటీ హైదరాబాద్‌లో తన క్యాంపస్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2023-24 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)కి అనుబంధంగా ఉన్న ఈ పాఠశాల ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించడంలో సహాయపడటానికి, విద్యార్థి అవసరాలపై దృష్టి సారించే సమగ్రమైన పాఠ్యాంశాలను అందిస్తోంది.
2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ GMR ఏరోసిటీ హైదరాబాద్‌లోని ఐదు ఎకరాల క్యాంపస్‌లో విస్తరించి ఉంది. DPS సమగ్ర పాఠ్యాంశాలు, సమగ్రాభివృద్ధి, డిజిటల్ తరగతి గదులు కలిగి, NEP (నూతన విద్యా విధానం)తో, ఉత్తమ బోధనా ఫ్యాకల్టీతో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తోంది. క్యాంపస్‌లో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 20:1గా ఉంది. దీనిలో 10 కంటే ఎక్కువ ఆఫ్టర్ స్కూల్ క్లబ్బులు, 11 అత్యాధునిక ప్రయోగశాలలు, నగరంలోని విద్యార్థుల కోసం 15 పాఠశాల బస్సులు ఉన్నాయి. క్యాంపస్‌లో MS ధోని క్రికెట్ అకాడమీతో పాటు, హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ శిక్షణ అకాడమీ, యమ స్కేటింగ్ అకాడమీ, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, బాస్కెట్‌బాల్, తైక్వాండో, శాండ్పిట్, యోగా, వినోదం, అడ్వెంచర్ కార్యకలాపాలు కూడా ఉంటాయి.
దీనిపై GMR ఎయిర్పోర్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ CEO అమన్ కపూర్, “ఢిల్లీ పబ్లిక్ స్కూల్ GMR ఏరోసిటీ క్యాంపస్‌కు రావడం మాకు ఆనందంగా ఉంది. ఏరోసిటీ హైదరాబాద్ విద్య, R&D, IT, మరియు వైద్య సదుపాయాల కోసం అద్భుతమైన పర్యావరణ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తుంది,’’ అన్నారు.
DPS & పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్కా కొమరయ్య, “విద్య సమాచార దాహాన్ని తీర్చడం మాత్రమే కాదు, నైపుణ్యంతో సమాజంలో మంచి మానవులను తయారు చేసేలా జ్ఞానదాహాన్ని కలిగించాలి. మంచి హృదయం, మంచి తలపులు మాత్రమే కాకుండా దానికి అక్షరాస్యత జోడించినప్పుడు, సాటిలేని వ్యక్తులు తయారవుతారు,’’ అన్నారు.
GMR ఏరోసిటీ హైదరాబాద్‌లో బిజినెస్ పార్క్, రిటైల్ పార్క్, ఏరోస్పేస్ మరియు ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్స్ పార్క్ మరియు హాస్పిటాలిటీ వంటి కీలకమైన పోర్టులు, ఎస్టాబ్లిష్మెంటులు ఉన్నాయి. ఇది వ్యాపారాల కోసం కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే వన్-స్టాప్ గమ్యం. హైదరాబాద్ విమానాశ్రయం నడిబొడ్డున ఉన్న, GMR ఏరోసిటీ హైదరాబాద్ సమీపంలోని ఆధునిక సౌకర్యాలతో బాగా కనెక్ట్ చేయబడింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







