యూఏఈ వెదర్ అప్డేట్: ఎల్లో అలర్ట్ జారీ

- January 18, 2023 , by Maagulf
యూఏఈ వెదర్ అప్డేట్: ఎల్లో అలర్ట్ జారీ

యూఏఈ: వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. ముఖ్యంగా పగటిపూట దేశంలోని ఉత్తర,  తూర్పు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఉత్తర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, అబుధాబిలో 23°C , దుబాయ్‌లో 24°Cకి చేరుకుంటాయని తెలిపింది. ఎమిరేట్స్‌లో 19°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా వేసింది. గాలుల కారణంగా అరేబియా గల్ఫ్‌ సముద్రం, ఒమన్ సముద్రం అల్లకల్లోలంగా ఉంటాయని ఎన్సీఎం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com