అబుధాబికి చేరుకున్న ఒమాన్ సుల్తాన్
- January 18, 2023
అబుధాబి: ఒమాన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. ప్రెసిడెన్షియల్ ఎయిర్‌పోర్ట్‌లో సుల్తాన్‌కు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రెసిడెన్షియల్ కోర్ట్‌లోని ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్ కూడా ఒమాన్ సుల్తాన్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అబుధాబిలో జరగనున్న జీసీసీ రాష్ట్రాలు, జోర్డాన్, ఈజిప్ట్ నాయకుల మధ్య జరిగే సమావేశంలో సుల్తాన్ పాల్గొంటారు. అనంతరం యూఏఈలో ఒమాన్ సుల్తాన్ పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







