బహ్రెయిన్ నుండి 5,300 మంది ప్రవాసులు బహిష్కరణ

- January 18, 2023 , by Maagulf
బహ్రెయిన్ నుండి 5,300 మంది ప్రవాసులు బహిష్కరణ

బహ్రెయిన్: అక్టోబర్ నుండి డిసెంబర్ 2022 వరకు బహ్రెయిన్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినందుకు సుమారు 5,300 మంది కార్మికులను బహిష్కరించారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు (NPRA), అలాగే ఇతర సంబంధిత ప్రభుత్వ సంస్థలు ఉమ్మడిగా 7,153 తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 731 క్రిమినల్ ఉల్లంఘనలు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. ఇందులో యజమానులు చేసిన 257 ఉల్లంఘనలు, 474 కార్మికులవి ఉన్నాయి. ఈ ఉల్లంఘనల నుండి BD253,000 జరిమానాలను వసూలు చేశారు. 2021లో ఇదే కాలంతో పోలిస్తే తనిఖీలు 33% పెరగడం గమనార్హం. మరోవైపు యజమానులు, కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ బహ్రెయిన్ తన పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని కొనసాగించేలా తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని లేబర్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com