బహ్రెయిన్ నుండి 5,300 మంది ప్రవాసులు బహిష్కరణ
- January 18, 2023
బహ్రెయిన్: అక్టోబర్ నుండి డిసెంబర్ 2022 వరకు బహ్రెయిన్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినందుకు సుమారు 5,300 మంది కార్మికులను బహిష్కరించారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు (NPRA), అలాగే ఇతర సంబంధిత ప్రభుత్వ సంస్థలు ఉమ్మడిగా 7,153 తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 731 క్రిమినల్ ఉల్లంఘనలు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. ఇందులో యజమానులు చేసిన 257 ఉల్లంఘనలు, 474 కార్మికులవి ఉన్నాయి. ఈ ఉల్లంఘనల నుండి BD253,000 జరిమానాలను వసూలు చేశారు. 2021లో ఇదే కాలంతో పోలిస్తే తనిఖీలు 33% పెరగడం గమనార్హం. మరోవైపు యజమానులు, కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ బహ్రెయిన్ తన పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని కొనసాగించేలా తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని లేబర్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







