విమాన టిక్కెట్‌తో 96 గంటల వీసా: సౌదీ ఎయిర్‌లైన్
- January 19, 2023
సౌదీ: సౌదీ అరేబియా విమానయాన సంస్థ సౌదీయా ఎయిర్‌లైన్ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. విమాన టిక్కెట్ కలిగి ఉన్న ప్రయాణికులు గరిష్టంగా నాలుగు రోజులు (లేదా 96 గంటలు) సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో హజ్, ఉమ్రా చేయడానికి ప్రయాణీకుడు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, ఎయిర్ అరేబియా అబుధాబి విమాన టిక్కెట్లతో పాటు 48 నుండి 96 గంటల ట్రాన్సిట్ వీసాలను అందించే అనేక యూఏఈ ఆధారిత విమానయాన సంస్థలలో ఈ వ్యవస్థ ఇప్పటికే అమలులో ఉంది. ప్రయాణీకులు ఆన్లైన్లో విమాన టిక్కెట్లను బుక్ చేసే సమయంలోనే వీసా ఆప్షన్ ను ఎంచుకోవాలని సౌదీయా ఎయిర్‌లైన్ సూచించింది.
తాజా వార్తలు
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్







