ఫర్వానియా ప్రాంతంలో 18 విద్యుత్ ఉల్లంఘనలు
- January 19, 2023
కువైట్: విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ బృందం ఫర్వానియాలో క్షేత్ర స్థాయిలో పర్యటించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీకి చెందిన కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో "బ్యాచిలర్స్" నివసించే ప్రాంతాల్లో విద్యుత్, నీటిని పొదుపుగా వాడాలని ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగ వ్యవస్థలను తనిఖీ చేశారు. టీమ్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ అల్-షమ్మరీ మాట్లాడుతూ.. తమ తనిఖీలు కొనసాగుతాయన్నారు. విద్యుత్, నీటి దుర్వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రచార కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. జనవరిలో మొత్తం 18 విద్యుత్, నీటి ఉల్లంఘనలు నమోదయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







