యూఏఈలో తగ్గిన 90 రోజుల విజిట్ వీసాల జారీ!

- January 21, 2023 , by Maagulf
యూఏఈలో తగ్గిన 90 రోజుల విజిట్ వీసాల జారీ!

యూఏఈ: మూడు-నెలల విజిట్ వీసాల జారీని యూఏఈ కఠినతరం చేసింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా  30, 60 రోజుల విజిట్ వీసాలు మాత్రమే జారీ చేయబడుతున్నాయని అల్హింద్ బిజినెస్ సెంటర్ నుండి నౌషాద్ హసన్ చెప్పారు. అవి కూడా Dh400, Dh450 మధ్య ధరలలో అందుబాటులో ఉన్నాయన్నారు. సందర్శకులు తమ వీసాల కోసం సుమారుగా Dh900 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చుతో ఒక నెల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. విస్తృతమైన సంస్కరణల తర్వాత యూఏఈ వీసా విధానాలలో అనేక మార్పులు వచ్చాయి. అయితే, కొన్ని షరతులతో 90 రోజుల వీసాలను ఇప్పటికీ జారీ చేస్తున్నారని స్మార్ట్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ అన్నారు. ఏదైనా వైద్య అవసరాల కోసం దేశానికి వచ్చే వారు వైద్య నివేదికలు, వైద్యుల అపాయింట్‌మెంట్‌లు, ఇతర సహాయక డాక్యుమెంటేషన్‌ను సమర్పిస్తే 90 రోజుల వీసాను పొందుతారని తెలిపారు. అలాగే జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ వీసా 90 రోజులు ఉండాలనుకునే వారికి అందుబాటులో ఉందన్నారు. మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ప్రకారం.. ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాల నుండి తాజా గ్రాడ్యుయేట్‌లకు 60, 90, 120 రోజుల వీసాలు అందుబాటులో ఉన్నాయని అహ్మద్ వివరించారు. జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ వీసా ఖర్చు, బస వ్యవధి ఆధారంగా ఫీజులు ఉంటాయన్నారు. వీసా ఫీజులో Dh1,025 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్, బీమా ఉన్నాయి. 60 రోజుల వీసా మొత్తం Dh1,495 ఖర్చవుతుందని,  90-రోజుల వీసాలకు Dh1,655, 120-రోజుల అనుమతికి Dh1,815 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అహ్మద్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com