ధోఫర్ గవర్నరేట్‌లో మంటలను ఆర్పిన సీడీఏఏ
- January 21, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లోని పొలంలో చెలరేగిన మంటలను ఆర్పినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. "ధోఫర్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సలాలా విలాయత్‌లోని అవ్కాద్ ప్రాంతంలోని ఒక పొలంలో గడ్డి మంటలను ఆర్పాయి" అని సీడీఏఏ తెలిపింది. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేసింది. గడ్డి మంటలు త్వరగా వ్యాపించగలవని, గడ్డిని వీలయినంత త్వరగా కత్తిరించడమో లేదా పశువులను మేపాలని సూచించింది. మంటలు చెలరేగిన సమయంలో జంతువులను దూరంగా తరలించాలి. అగ్నిమాపక పరికరాలు అన్ని సందర్భాల్లో పనిచేసేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. అగ్నిమాపక వాహనం వచ్చేందుకు సరైన దారిని ఏర్పాటు చేయాలని సీడీఏఏ రైతులకు సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







