జనవరి 22 నుంచి రియాద్ స్పేస్ ఎక్స్పో ప్రారంభం
- January 21, 2023
రియాద్ : రియాద్ సిటీ రాయల్ కమీషన్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రియాద్ ఎగ్జిబిషన్ ఫర్ స్పేస్ ఆదివారం(జనవరి 22) ఇక్కడ కింగ్ సల్మాన్ సైన్స్ ఒయాసిస్‌లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 29 వరకు ఒక నెలపాటు కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. విద్యా మంత్రిత్వ శాఖ, సౌదీ స్పేస్ అథారిటీ, కింగ్ అబ్దుల్ అజీజ్ సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KACST), కింగ్ సల్మాన్ సైన్స్ ఒయాసిస్‌ల భాగస్వామ్యంతో "హ్యూమన్ బీయింగ్ అండ్ స్పేస్" అనే థీమ్‌తో జరుగుతున్న ఈ ఈవెంట్ సైన్స్, ఎంటర్టైన్మెంట్ మిళితంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈవెంట్‌కు సందర్శకులు తమ టిక్కెట్లను (https://riyadhspacefair.com/#contact) లింక్ ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







