సునీల్ టైమ్ ఆయేగా.! తమిళ నాట ‘పూల రంగడి’ హవా.!

- January 23, 2023 , by Maagulf
సునీల్ టైమ్ ఆయేగా.! తమిళ నాట ‘పూల రంగడి’ హవా.!

సునీల్ జోరు మామూలుగా లేదండోయ్. ఒకప్పుడు స్టార్ కమెడియన్. రాజమౌళి పుణ్యమా అని ‘మర్యాద రామన్న’తో హీరో అయిపోయాడు. ఆ తర్వాత రెండు మూడు సూపర్ హిట్లు కొట్టి, నీరసించి పోయాడు. 

హీరో అయ్యాక కమెడియన్‌గా అవకాశాలు తగ్గడంతో పాటూ, కెరీర్ కూడా పాతాళానికి పడిపోయింది. అటు హీరోకీ కాక, ఇటు కమెడియన్‌గానూ వుండలేక సతమతమైపోయాడు. ఆ తరుణంలోనే చిన్నా, పెద్దా తేడా లేకుండా ఏ సినిమా పడితే ఆ సినిమాలో చిన్న చిన్న రోల్స్‌తో సరిపెట్టుకున్నాడు.

సుకుమార్ ‘పుష్ప’లో సునీల్ కోసం ‘మంగళం శీను’ క్యారెక్టర్ ఎప్పుడయితే డిజైన్ చేశాడో.. ఇక ఆ తర్వాత నుంచీ సునీల్ విలన్ పాత్రలకే ఫిక్సయిపోయాడు. చాలా చిన్న సినిమాల్లో విలన్ రోల్స్ చేసేశాడు.

ఇక, ఇప్పుడు తమిళ తంబీలు సునీల్ విలనిజాన్ని తెగ ఇష్టపడిపోతున్నారట. దాంతో, తమిళ స్టార్ హీరోలు సునీల్ కోసం క్యూ కట్టేశారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సహా, కార్తీ, శివ కార్తికేయన్ తదితర హీరోల సినిమాల్లో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా సినిమాలోనూ సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. లేటెస్టు‌గా ఈ సినిమా నుంచి సునీల్ రోల్‌ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 
దాంతో, సునీల్ విలనిజం తమిళ నాట ఇంతటితో తగ్గేదే లే.! అనిపిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com