ఓటీటీలో ‘ధమాకా’ పరువు పోతోందిగా.!
- January 23, 2023
ఇయర్ ఎండింగ్ గిఫ్ట్‌గా వచ్చిన మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ సూపర్ డూపర్ హిట్టు కొట్టి, సంవత్సరాంతంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌కి సక్సెస్ గిఫ్ట్ ఇచ్చింది.
‘ధమాకా’తో రవితేజ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘వాల్తేర్ వీరయ్య’ హిట్‌తో డబుల్ ధమాకా అనిపించుకున్నాడు.
అంతా బాగానే వుంది. కానీ, రీసెంట్‌గా ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలో ‘ధమాకా’ చూసిన వారంతా పెదవి విరిచేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు రెండూ మిక్సీలో వేసి వదిలిపెట్టారంటూ తిట్టి పోస్తున్నారు.
మరీ సీన్ టూ సీన్, సాంగ్ టు సాంగ్ అంతలా ఎలా కాపీ కొట్టేశావయ్యా మాస్ రాజా.! కాస్తయినా సిగ్గుండక్కర్లా.! అని దారుణంగా తిట్టేస్తున్నారు. దాంతో, హిట్ అనుకున్న ‘ధమాకా’ పరువు మొత్తం పోయినట్లవుతోందిప్పుడు.
ఇక తదుపరి మాస్ రాజా ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







