పురుషుల‌ టీ20 జ‌ట్టును ప్ర‌క‌టించిన ఐసీసీ.. ముగ్గురు భార‌త క్రికెట‌ర్ల‌కు చోటు

- January 23, 2023 , by Maagulf
పురుషుల‌ టీ20 జ‌ట్టును ప్ర‌క‌టించిన ఐసీసీ.. ముగ్గురు భార‌త క్రికెట‌ర్ల‌కు చోటు

పురుషుల టీ20 జ‌ట్టును ఐసీసీ సోమ‌వారం ప్ర‌క‌టించింది. భార‌త జ‌ట్టు నుంచి విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జ‌ట్టుకు ఎంపికయ్యారు. ఈ టీమ్‌కు జోస్ బ‌ట్ల‌ర్‌ను కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌గా ఎంపిక చేసింది. 

ICC : పురుషుల టీ20 జ‌ట్టును ఐసీసీ సోమ‌వారం ప్ర‌క‌టించింది. 2022 సంత్స‌రానికి గానూ 11 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. భార‌త జ‌ట్టు నుంచి అత్య‌ధికంగా ముగ్గురు క్రికెట‌ర్లు ఈ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జ‌ట్టుకు ఎంపికయ్యారు. ఇంగ్లండ్ టీమ్ నుంచి జోస్ బ‌ట్ల‌ర్, ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, పాక్ నుంచి రిజ్వాన్, హ్యారిస్ రౌఫ్‌ల‌ను సెల‌క్ట్ చేసింది. ఈ లిస్టులో స్పిన్న‌ర్ హ‌స‌రంగ (శ్రీ‌లంక‌), సికింద‌ర్ ర‌జా (జింబాబ్వే), జోష్ లిటిల్ (ఐర్లాండ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) ఉన్నారు. ఈ టీమ్‌కు జోస్ బ‌ట్ల‌ర్‌ను కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌గా ఎంపిక చేసింది. రిజ్వాన్, బ‌ట్ల‌ర్‌ల‌ను ఓపెనింగ్ జోడీగా ప్ర‌క‌టించింది.

జ‌ట్టు ఇదే.. జోస్ బ‌ట్ల‌ర్ (కెప్టెన్, వికెట్ కీప‌ర్), మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, గ్లెన్ ఫిలిప్స్, సికింద‌ర్ ర‌జా, హార్ధిక్ పాండ్యా, సామ్ క‌ర‌న్, వ‌నిందు హ‌స‌రంగ‌, హ్యారిస్ రౌఫ్‌, జోష్ లిటిల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com