అపార్ట్‌మెంట్‌లో వ్యక్తి నిర్బంధం.. నలుగురు ఆఫ్రికన్లకు 6 నెలల జైలు శిక్ష

- January 23, 2023 , by Maagulf
అపార్ట్‌మెంట్‌లో వ్యక్తి నిర్బంధం.. నలుగురు ఆఫ్రికన్లకు 6 నెలల జైలు శిక్ష

దుబాయ్: ఎమిరేట్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తిని నిర్బంధించినందుకు నలుగురు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. శిక్ష కాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించనున్నారు. నిందితుల్లో ఇద్దరు ఆఫ్రికన్ మహిళలు, పురుషులు ఉన్నారు. వీరిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ ఘటన గతేడాది ఆగస్టులో జరిగింది. ఒక ఆఫ్రికన్ తన స్నేహితుడు అపార్ట్‌మెంట్‌లో నిర్బంధించబడ్డాడని, ఒక ప్రత్యేక ప్రదేశంలో Dh800 ఇవ్వాలని కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందగానే పోలీసులు సదరు అపార్టుమెంట్ కు చేరుకొని బాధితుడిని విడిపించి, అతడిని నిర్బంధించిన నలుగురు ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధించిన వ్యక్తి తమ దగ్గర అప్పు తీసుకున్నాడని, తిరిగి  అడిగినప్పుడు స్పందించలేదని, అందుకే స్నేహితుల సాయంతో అపార్టుమెంట్లో నిర్బంధించినట్లు విచారణ సందర్భంగా నిందితులు తెలిపారు. కానీ వారి వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. దోషులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని తీర్పునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com