పర్యాటక సౌకర్యాలకు కొత్త నిబంధనలు.. ఉల్లంఘిస్తే 1మిలియన్ రియాల్ జరిమానా
- January 24, 2023
సౌదీ: నిబంధనలను ఉల్లంఘించిన పర్యాటక సౌకర్యాలకు 1 మిలియన్ రియాల్ వరకు జరిమానాను విధించనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే పర్యాటక సౌకర్యాలపై సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ ఆదివారం కొత్త జరిమానాలను వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక హ్యాండిల్‌లో ఒక ట్వీట్ చేసింది. సౌదీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలో భాగంగా తాజా నిబంధనలు ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 25 లోపు లైసెన్స్ పొందని పర్యాటక సౌకర్యాలను మూసివేసి, పది లక్షల రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కొత్త నిబంధన పర్యాటక వసతి సౌకర్యాలు, పర్యాటక వసతి సౌకర్యాల నిర్వహణ, టూర్ ఆపరేటర్లు, సాధారణ ప్రయాణ, పర్యాటక సేవలు, ట్రావెల్, టూరిజం ఏజెన్సీలు, టూరిజం వసతి బుకింగ్, టూరిజం కన్సల్టెన్సీ, టూర్ గైడ్‌లకు వర్తిస్తాయని పేర్కొంది. ఇప్పటికే లైసెన్స్ ఉన్న సౌకర్యాలు ప్రతి కార్యాచరణకు కొత్త నియంత్రణ ప్రమాణాలను వర్తింపజేయాలని, లైసెన్స్ లేని సౌకర్యాలు మార్చి 25 లోపు లైసెన్స్ పొందాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







