ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ..
- January 24, 2023
న్యూ ఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.ప్రయాణికుడి అభ్యంతరకర ప్రవర్తనపై ఫిర్యాదు చేయనందుకుగాను ఆ సంస్థకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో మరోసారి ఎయిర్ ఇండియా వివాదంలో చిక్కుకుంది.
ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డీజీసీఏ జరిమానా విధించింది. గత డిసెంబర్ 6న ప్యారిస్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు నిబంధనలకు విరుద్ధంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. విమానంలో పొగ తాగాడు. అలాగే మద్యం కూడా సేవించి ఉన్నాడు. విమానయాన సిబ్బంది చెప్పిన సూచనల్ని అతడు పట్టించుకోలేదు.
అలాగే ఒక సీటులో మహిళకు కేటాయించిన బ్లాంకెట్‌ను తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 5న విషయం వెలుగు చూడగా, దీనిపై డీజీసీఏ ఎయిర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగి చాలా రోజులవుతున్నా బాధ్యుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఈ విషయాన్ని డీజీసీఏకు ఎందుకు నివేదించలేదని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని డీజీసీఏ పేర్కొంది. దీనికి ఎయిర్ ఇండియా సంస్థ సమాధానం ఇచ్చింది.ఈ సమాధానంపై డీజీసీఏ సంతృప్తి చెందలేదు. దీంతో ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









