రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి - కెటిఆర్
- January 25, 2023
హైదరాబాద్: ఐటీ, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ ఈరోజు బిఆర్‌ఎస్ భవన్‌లో హైదరాబాద్ నగరంలో భవనాల్లో అగ్నిప్రమాదల ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. మంత్రి కెటిఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న భవనాలపై తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. ఫైర్ సేఫ్టీ లేని భవనాల గుర్తింపు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, పాత భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, సెల్లార్లపై అక్రమ వ్యాపారాల నివారణకు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా డెక్కన్ స్పోర్ట్స్ మాల్‌లో గల్లంతైన మృతులకు కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మూడు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
అలాగే భవనాల విషయంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ భవనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సూచించనున్నది. అలాగే అగ్నిమాపకశాఖకు భారీగా నిధులు కేటాయించాలని, ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అగ్నిపకశాఖ ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయాలి నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణలో ప్రభుత్వం చేపట్టే చర్యలో భవన యజమానులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాలన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని, విదేశాల్లో ఫైర్ సేఫ్టీపై అధ్యయనం చేయాలన్నారు. అవసరమైన ఆధునిక సామగ్రి అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అత్యవసర సామగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







