హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం
- January 25, 2023హైదరాబాద్: హైదరాబాద్ నుంచి గోవాకు ఆకాశ ఎయిర్ తొలి విమాన సర్వీసును ఈరోజు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభించారు. ప్రారంభ విమానం హైదరాబాద్ నుండి గోవాకు మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరింది. ఆకాశ హైదరాబాద్ నుండి బెంగళూరుకు రోజువారీ విమానాలను కూడా ప్రారంభించింది. GHIAL, ఆకాశ సీనియర్ అధికారులు మరియు ఇతర విమానాశ్రయ భాగస్వాములు విమానాశ్రయంలో ఈ రోజు ఆకాశ ఎయిర్‌లైన్ తొలి విమాన సర్వీసులో వెళుతున్న ప్రయాణికులకు వీడ్కోలు పలికారు.
ప్రదీప్ పణికర్, CEO-GHIAL మాట్లాడుతూ, “హైదరబాద్ నుంచి వీలైనంత దేశీయ ఎయిర్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను విస్తరించడం, మరిన్ని విమానయాన సంస్థలను జోడించడానికి మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో GHIAL నుంచి ఆకాశ ఎయిర్ సర్వీసులు ప్రారంభించడంపై మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దశల వారీగా విస్తరణ, తద్వారా విమానాశ్రయ సామర్థ్యం పెరుగుదలతో, మరిన్ని గమ్యస్థానాలకు కొత్త సర్వీసులు రావడం వల్ల మరింత ఎక్కువ మంది ప్రయాణికులు విమాన ప్రయాణాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తుంది. భారతీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ఆకాశ ఎయిర్ సర్వీసుల ప్రారంభం ఈ దిశగా మరో ముందడుగు.’’ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..