530 మంది ప్రవాసుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించిన కువైట్
- January 28, 2023
కువైట్: 2022లో నకిలీ పాస్‌పోర్ట్‌తో తిరిగి కువైట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న 530 మంది బహిష్కరణకు గురైన ప్రవాసుల ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వెల్లడించింది. నివేదిక ప్రకారం నకిలీ పాస్‌పోర్ట్‌లు, తప్పుడు పేర్లను ఉపయోగించినా విమానాశ్రయంలో వేలిముద్ర పరికరాల ద్వారా వారిని గుర్తించినట్లు పేర్కొంది. వారిలో ఎక్కువ మంది ఆసియా దేశాల నుండి వచ్చినవారు ఉన్నారని, వారిలో 120 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 2011లో ఎయిర్‌పోర్ట్‌లో ఫింగర్ ప్రింటింగ్ పరికరాలను ఏర్పాటు చేసిన తర్వాత బహిష్కరణకు గురైన వేలాది మందిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించినట్లు నివేదిక పేర్కొంది. కేవలం 3 సెకన్లలోనే వాంటెడ్ లిస్ట్, ట్రావెల్ బ్యాన్‌లో ఉన్న వారిని కూడా సిస్టమ్ గుర్తిస్తుందని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తన నివేదికలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







