చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులపై LMRA ఉక్కుపాదం
- January 28, 2023
బహ్రెయిన్: పోటీతత్వ, న్యాయమైన, స్థిరమైన లేబర్ మార్కెట్‌ను రక్షించడానికి చట్టవిరుద్ధమైన పద్ధతులకు వ్యతిరేకంగా తనిఖీ ప్రచారాలను వేగవంతం చేస్తున్నట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), అంతర్గత మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. ప్రచారాల ఫలితంగా లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన ఉల్లంఘనలను గుర్తించి కేసులను నమోదు చేయడంతోపాటు చట్టపరమైన చర్యల కోసం రిఫర్ చేసినట్లు పేర్కొన్నాయి. LMRA నార్తర్న్ గవర్నరేట్‌లో జాతీయత, పాస్‌పోర్ట్‌లు,నివాస వ్యవహారాలు (NPRA) మరియు గవర్నరేట్ సంబంధిత పోలీసు డైరెక్టరేట్‌తో సమన్వయంతో తనిఖీలు నిర్వహించింది. అలాగే సెంటెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అంతర్గత మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రైమ్ డిటెక్షన్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌తో సమన్వయంతో ముహర్రాక్లో ఉమ్మడిగా తనిఖీలు చేపట్టింది. అలాగే LMRA ఎన్ఫోర్స్మెంట్ విభాగం క్యాపిటల్ గవర్నరేట్‌లో తనిఖీలు నిర్వహించింది. అధికారిక వెబ్సైట్ www.lmra.bhలో ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా అధికారిక కాల్ సెంటర్‌కు (17506055) కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని కోరింది. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను పరిష్కరించడంలో ప్రభుత్వ ఏజెన్సీల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సంఘంలోని సభ్యులందరికీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







