చైతూకి షాకిచ్చిన సమంత.! ఆ హీరోతో ప్రొసీడ్ అనేసిందట.!
- January 28, 2023
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య ఓ సినిమా చేయాల్సి వుంది. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్‌పై సైన్ చేశారు. అయితే, ఇదంతా గతం. సమంత, చైతూ కలిసున్నప్పటి విషయం. ఆ తర్వాత వీరిద్దరూ అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయి విడాకులు తీసుకోవడం తెలిసిన సంగతే.
అయితే, పర్సనల్ లైఫ్ వేరు, ప్రొషిషనల్ లైఫ్ వేరు.. ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారనే భావించారంతా. కానీ, అలా జరగలేదు. ఆ ప్రాజెక్ట్ నుంచి చైతూ తప్పుకున్నాడు. కానీ, సమంత మాత్రం తప్పుకోలేదు. చైతూ ప్లేస్‌లో ఏ హీరో వచ్చినా తనకు ఓకే అని సంకేతాలిచ్చిందట.
అలా, ఆ ప్రాజెక్ట్ కాస్త ముందుకు జరిగి, చైతూ ప్లేస్‌లో నాని పేరు వినిపిస్తోంది. నాని, సమంత కాంబినేషన్లో నందినీ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ని త్వరలోనే సెట్స్ మీదికి తీసుకెళ్లనుందని తెలుస్తోంది. అన్నట్లు మయో సైటిస్ చికిత్స నుంచి తేరుకున్న సమంత ఇటీవలే తన ఫిట్‌నెస్‌పై కసరత్తులు మొదలెట్టింది. త్వరలోనే ‘ఖుషీ’ సినిమా పూర్తి చేసే దిశగా సమంత తను తాను సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







